ICDS: అంగనవాడీలకు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:14 AM
కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన 2026-27 బడ్జెట్‌లో అంగనవాడీలు తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాల పెంపు కోసం నిధులు కేటా యించకపోవడం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అన్నారు. సీఐటీయూ ఆల్‌ఇండియా కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలో మంగళవారం అంగనవాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
- ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు
బుక్కపట్నం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన 2026-27 బడ్జెట్‌లో అంగనవాడీలు తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాల పెంపు కోసం నిధులు కేటా యించకపోవడం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అన్నారు. సీఐటీయూ ఆల్‌ఇండియా కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలో మంగళవారం అంగనవాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓబిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో దాదాపు కోటిమంది స్కీమ్ వర్కర్లుకు నిధులు కేటాయించకపోవడం అన్యాయ మన్నారు. క్షేత్రస్థాయి కార్మికుల వేతనంలో పెరుగుదల లేదన్నారు. అంగనవాడీ కార్మికులకు జీతాలు పెంచడానికి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అంగనవాడీ కార్మికులు పెద్దఎత్తున పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అంగనవాడీ కార్మికుల మండలకమిటీ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి నాగమణి, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....