Share News

వీబీ జీ రామ్‌ జీతో అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:22 PM

కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని చాలా పకడ్భందీగా రూపొందించిందని, దీన్ని అమలు వల్ల అక్రమాలకు తావు లేకుండా కూలీలకు లబ్ధి చేకూరుతుందని కిసాన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌ స్పష్టంచేశారు.

వీబీ జీ రామ్‌ జీతో అక్రమాలకు చెక్‌
మాట్లాడుతున్న కిసాన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌

బ్రహ్మసముద్రం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని చాలా పకడ్భందీగా రూపొందించిందని, దీన్ని అమలు వల్ల అక్రమాలకు తావు లేకుండా కూలీలకు లబ్ధి చేకూరుతుందని కిసాన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌ స్పష్టంచేశారు. గురువారం మండలంలోని వేపులపర్తిలో కిసాన మోర్చ జిల్లా అధ్యక్షుడు కడపం దామోదర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కూలీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకంపై అవగాహన కల్పిస్తూ రాయలసీమ జిల్లాల పర్యటిస్తున్నట్లు తెలిపారు. కూలీలతో మాట్లాడుతూ వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు తరలించే కాలువ పనులను పరిశీలించారు. అలాగే భైరవానితిప్ప ప్రాజెక్టునూ సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌, టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, బీజేపీ రాయలసీమ ఇనఛార్జ్‌ తిమ్మారెడ్డి, రాష్ట్ర కిసాన మోర్ఛ ఉపాధ్యక్షులు సతీష్‌, చంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత కుమార్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జింకా వసుంధర దేవి, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:22 PM