ROAD: పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:49 PM
ఏళ్లు గడుస్తున్నా తమకా దారి కష్టాలు తీరడం లేదు. రహదారి గుంతలమయంగా మార డంతో తాము పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదంటూ మండలం లోని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్న ఉగ్గిరెడ్డిపల్లి వాసులు
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఏళ్లు గడుస్తున్నా తమకా దారి కష్టాలు తీరడం లేదు. రహదారి గుంతలమయంగా మార డంతో తాము పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదంటూ మండలం లోని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కదిరి - హిందూపురం రహదారి నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉగ్గిరెడ్డిపల్లికి ఉంది. ఆ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. కంకర తేలి గుంతలమ యంగా మారింది. దీని ప్రయాణం ప్రజలకు కష్టతరమవుతోంది. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహ నాల్లో వెళ్ళాలంటే ఆచితూచి వెళ్లాల్సిన పరిస్థితి. ఏ మాత్రం ఆదమ రిచినా ప్రమాదాలు తప్పవు. రహదారిని బాగు చేయాలని గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపో యిందని ఆ గ్రామస్థులు తెలిపారు. అత్యవసర సమయాల్లో అంబు లెన్స రా వాలన్నా కష్టతరమవుతోందని వాపోతున్నారు. వాహనాల్లో వెళుతుంటే నడుము నొప్పులు కూడా వస్తున్నాయనీ, ద్విచక్రవాహన దా రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సరిగా లేకపోవడంతో పాఠశాల కు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బంది పడాల్సివస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి వెళ్లే రహదారిని బాగు చేయాలని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....