Share News

MLA: ఆస్తి... మన జీవిత భద్రతకు భరోసా

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:56 PM

ప్రతి రైతు జీవిత భద్రతకు ఆ స్తి భరోసా అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని వంకరకుంట, గోపేపల్లి పంచాయతీల్లో రైతులకు బుధవారం రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు.

MLA: ఆస్తి... మన జీవిత భద్రతకు భరోసా
MLA and former minister handing out pass books at Wankarakunta

ఫ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి

నల్లమాడ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతు జీవిత భద్రతకు ఆ స్తి భరోసా అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని వంకరకుంట, గోపేపల్లి పంచాయతీల్లో రైతులకు బుధవారం రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. వంకరకుంట పంచాయతీలో 383, గో పేపల్లి పంచాయతీలో 737 పాస్‌పుస్తకాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత వైసీపీ పాలనలో మన ఆస్తి పాస్‌పుస్తకంలో జగన ఫొటోలు పెట్టి పంపిణీ చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వ్యతిరేకించినా ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్టు తీసుకొచ్చారన్నారు.


కూటమి అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి చం ద్రబాబు ఆ యాక్టును రద్దుచేసి, రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తున్నారని అన్నారు. పాస్‌పుస్తకంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి సరి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సువర్ణ, తహసీ ల్దార్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి, వీఆర్‌ఓలు జగన్మోహనరెడ్డి, గంగాధర్‌, పాపారాయుడు, సోమశేఖర్‌, మాలిక్‌, టీడీపీ మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, నాయకులు గడ్డం రమణారెడ్డి, దేశాయి మంజు నాథ్‌రెడ్డి, చంద్రమోహనరెడ్డి, ఉత్తమరెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమడగూరు: మండల పరిధిలోని కసముద్రం గ్రామంలో తహసీల్దార్‌ రామ్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాజముద్ర కలిగిన పట్టాదార్‌ పాసుపుస్తకాలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, మాజీ మంత్రి హాజరై రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. చుక్కల భూములు ఉన్న రైతులు వాటి వివరాలను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చి క్రయ, విక్ర యాలకు అనుమ తులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సువర్ణ, రెవెన్యూ సిబ్బంది, నాయకులు కాలేనాయక్‌, శ్రీనివాసరె డ్డి, ప్రభాకర్‌ రెడ్డి, నాగేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, రైతులు పాల్గొన్నారు


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 04 , 2026 | 11:56 PM