గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని మండలంలోని గోనేహాళ్లో మంగళవారం నిర్వహించారు.
మండలంలోని మల్లాపురం గ్రామం శ్రీ విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని విశ్వమాత ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి హోమాన్ని మంగళవా రం ఘనంగా నిర్వహించారు.
స్థానిక సనరైజర్స్ విద్యానికేతనలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల రైతు వేషధారణలు ఆకట్టుకున్నాయి
ఎస్కే యూనివర్శిటీ అంతర్కళాశాలల హాకీ విజేతగా కేహెచ డిగ్రీ కళాశాల విద్యార్థుల జ ట్టు నిలిచినట్టు ఆ కళాశాల పీడీ ఆనంద్ తెలిపారు. ఎస్కేయూ పరిధి లోని అంతర్ కళాశాలల గ్రూప్-సీ క్రీడాపోటీలను ఈనెల 21న అనం తపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారని తెలిపారు.
స్థానిక రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు
అ మృత పథకం కింద నిర్మించిన తాగునీటి పంప్హౌ్సను మున్సిపల్ చైర్పర్సన ఎన భవాని, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి మంగళవారం ప్రారంభించారు
భారతీయ ప్రాచీన సంప్రదాయ కళ అయిన తోలుబొమ్మల తయారీ కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శ్రీసత్యసాయి జిల్లాకు గర్వకారణమని ్ల కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రా మానికి చెందిన తోలుబొమ్మల తయారీ కళాకారిణి శివమ్మ డిసెంబరు 9న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ శిల్పగురు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నియోజకవర్గంలో అర్హులైన వారంద రికీ అందాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండలపరిషత సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
మహిళల వినూత్న కా ర్యక్రమాలతో, వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన హాలులో మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా సమాఖ్య నాలుగో వార్షిక మహాజన సభ నిర్వహించారు.
మండలకేంద్రమైన తనకల్లు, అలాగే కొక్కంటి క్రాస్లో జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని ఎని మిదేళ్ల క్రితం చేపట్టారు. అప్పట్లో కొక్కంటి క్రాస్, తనకల్లులో డివైడర్లను నిర్మించి, వాటి మధ్యలో విద్యుత స్తంభాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆ స్తంభాలకు లైట్లను కూడా అమర్చారు.