Share News

కూలర్‏లో చేరిన నాగుపాము

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:43 AM

ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు.

కూలర్‏లో చేరిన నాగుపాము

రొద్దం(అనంతపురం): ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్‏లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు. ఈ ఘటన రొద్దం మండలంలోని ఆర్‌. మరువపల్లిలో మురళి(Murali) ఇంట్లో సోమవారం జరిగింది. ఉదయం ఇంటి ఆవరణలోకి పాము రావడం గమనించిన మహిళలు భయంతో కేకలు వేశారు. దీంతో పాము కూడా భయపడి ఇంట్లో ఉన్న కూలర్‏లోకి వెళ్లి దాక్కుంది. చుట్టుపక్కల వారు వచ్చి అరగంటపాటు శ్రమించి కూలర్‏లో ఉన్న పామును బయటకు రప్పించి చంపేశారు.


pandu3.jpgఈ వార్తలు కూడా చదవండి:

మంత్రి చొరవతో గుండె మార్పిడి

బెంబేలెత్తిస్తున్న శునకాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 24 , 2026 | 11:57 AM