పసిడి ధరలో స్వల్ప పెరుగుదల! సిల్వర్ రేట్ డౌన్
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:18 AM
గోల్డ్, సిల్వర్ ధరలు రోజుకో రకంగా మారుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ మొదలైన కాసేపటికి పసిడి ధర స్వల్పంగా పెరగ్గా వెండి ధర భారీగా పతనమైంది. మరి ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన ధరలు మంగళవారం కాస్త నెమ్మదించాయి. పసిడి ధరలో కేవలం స్వల్ప పెరుగుదల నమోదు కాగా వెండి ధర భారీగా పతనమైంది. (Gold, Rates on Feb 24).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,780గా ఉంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రేటు రూ.430 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.400 మేర పెరిగి రూ.1,48,300కు చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్ పసిడి ధర గరిష్ఠంగా రూ.1,62,440కు చేరుకుంది. ముంబైలో రూ.1,61,780గా, ఢిల్లీలో రూ.1,61,930గా ఉంది.
నేడు ట్రేడింగ్ మొదట్లోనే వెండి ధర అనూహ్యంగా పతనమైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.10 వేల మేర తగ్గి రూ.2.9 లక్షల వద్ద తచ్చాడుతోంది. చెన్నైలో కూడా వెండి ధర ఇదే స్థాయిలో పతనమై రూ.2.9 లక్షలకు చేరుకుంది. ముంబైలో నిన్నటి ముగింపుతో పోలిస్తే ధర ఏకంగా రూ.15 వేల పతనమై ప్రస్తుతం రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,62,440; ₹1,48,900
ముంబై: ₹1,61,780; ₹1,48,300
ఢిల్లీ: ₹1,61,930; ₹1,48,450
కోల్‌కతా: ₹1,61,780; ₹1,48,300
బెంగళూరు: ₹1,61,780; ₹1,48,300
హైదరాబాద్: ₹1,61,780; ₹1,48,300
విజయవాడ: ₹1,61,780; ₹1,48,300
కేరళ: ₹1,61,780; ₹1,48,300
పుణె: ₹1,61,780; ₹1,48,300
వడోదరా: ₹1,61,830; ₹1,48,350
అహ్మదాబాద్: ₹1,61,830; ₹1,48,350
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,90,000
ముంబై: ₹2,85,000
ఢిల్లీ: ₹2,85,000
కోల్‌కతా: ₹2,85,000
బెంగళూరు: ₹2,85,000
హైదరాబాద్: ₹2,90,000
విజయవాడ: ₹2,85,000
కేరళ: ₹2,90,000
పుణె: ₹2,85,000
వడోదరా: ₹2,85,000
అహ్మదాబాద్: ₹2,85,000
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి:
ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల నిర్ణయం: ఆర్బీఐ గవర్నర్