Share News

HOSPITAL: ఆసుపత్రిలో క్యాజువాలిటీ కష్టాలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:52 PM

స్థానిక ప్రభుత్వా సుపత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగం మార్పుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నేళ్లుగా క్యాజువాలిటీ ఆసుపత్రి ప్రధాన గేటు దగ్గరలో ఉండేది.

HOSPITAL: ఆసుపత్రిలో క్యాజువాలిటీ కష్టాలు
Lock the gate at the casualty set up at the pharmacy store

గుంతకల్లు టౌన, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వా సుపత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగం మార్పుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నేళ్లుగా క్యాజువాలిటీ ఆసుపత్రి ప్రధాన గేటు దగ్గరలో ఉండేది. క్యాజువాటీలో రెండు మంచాలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా రోగుల సంఖ్య, అత్యవసర కేసులు పెరగడంతో వైద్య సిబ్బంది, వైద్యులు ఇబ్బంది పడేవారు. దీంతో క్యాజువాలిటీని జనవరి 26న పాత లేబర్‌ వార్డుకు మార్చారు. దీంతో ఆసుపత్రి ప్రధాన గేటు నుంచి క్యాజువా లిటీకి రోగులు రావాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. కొత్త క్యాజు వాలిటీ విభాగం ప్రధాన గేటు వద్ద ఫార్మసీ స్టోర్‌ ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాన గేటు మూసి వేసి తిరగి 3 గంటలకు తీస్తారు. తిరిగి సాయంత్ర 4 గంటలకు గేటుకు తాళం వేసి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గేటు తీస్తారు.


దీంతో పాత ప్రధాన గేటు నుంచి అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులు, ఆసుపత్రిలో చేరిన రోగులు చాలా ఇబ్బందులు ఎరుర్కొంటున్నారు. క్యాజు వాలిటీ మార్చారు కానీ అందకు తగ్గ సౌకర్యాలు కల్పించలేదని రోగులు వాపోతున్నారు.

వీల్‌చైర్‌, సె్ట్రచర్‌ కొరత

ప్రమాదకర స్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం ప్రధాన గేటు వద్ద నిబంధనల మేరకు అత్యవసర విభాగం బయట వీల్‌చైర్‌, సె్ట్రచర్‌, ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలు అందుబాటులో ఉండాలి. ఆసుపత్రిలో అ లాంటివేమీ కనిపించడం లేదు. ఆసుపత్రిలో కేవలం నాలుగు వీర్‌చైర్‌ లు ఉన్నాయి. అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారిని వారి బంధువులే వీల్‌చైర్‌, సె్ట్రచర్‌లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీల్‌చైర్‌, సె్ట్రచర్‌ కావాలని ఆసుపత్రి సిబ్బందిని ఆడిగితే వార్డులో ఉంటాయి తెచ్చుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. దీంతో రాత్రి వేళలో రోగులు, వారి బంధువులు చాలా మంది ఇబ్బందు లు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీల్‌చైర్‌లు అందుబాటులో లేకపోవడంతో బంధువులు రోగులను చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తున్నా రు. ఇప్పటికైనా ఆసుపత్రిలో వీల్‌చైర్‌, సె్ట్రచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ జయవర్ధన రెడ్డిని వివరణ కోరగా... ఫార్మసీ స్టోర్‌ వద్ద మందుల స్టాక్‌ ఉండటంతో గేటును బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు. మందులను వేరే చోటుకు మార్చి గేటును తెరిపిస్తాం అన్నారు. కొత్త వీల్‌చైర్ల కోసం ఆర్డర్‌ పెట్టామని, బుధవారం వస్తాయని తెలిపారు. వాటిని రోగులకు అందుబాటులో ఉంచుతామన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 24 , 2026 | 11:52 PM