పట్టణంలోని రుద్రభూమిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, కాలభైరవస్వామి విగ్రహం, వసతి గదుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం హ యాంలో అసంపూర్తిగా ఆగిపోయిన స్వర్ణ గ్రామ పంచాయతీలు, రైతు సేవా కేంద్రాలు, అంగన వాడీ కేంద్రాల నిర్మా ణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.21.33కోట్లు నిధులను మంజూరు చేసింది. వైసీపీ ప్రభు త్వంలో నియోజకవర్గంలో పలు అంగనవాడీ భవనాలు, గ్రామ సచివాల య భవనాల నిర్మాణం చేపట్టారు.
రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ అమల్లోకి రావడంతో గుంతకల్లు డివిజన్ కుదింపునకు గురైంది.
పట్టణంలోని శ్రీరాములపేటలో సోమవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పింఛనల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటోతేది అంటే ఆనందం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.
ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్ మేనేజ్‌మెంట్ అమలులోకి తెస్తామన్నారు.
జిల్లా సర్వజనాస్పత్రి పరిణాలపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సీరియస్ అయ్యారు. సోమవారం ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయశ్రీతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.