Share News

COLLECTOR: విద్యతో సామాజిక మార్పు : కలెక్టర్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:12 AM

వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యమని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. పుట్టపర్తి గోకులం వీధిలో నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని గురువారం రాత్రి సందర్శించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో మాట్లాడారు. చదువు, డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

COLLECTOR: విద్యతో సామాజిక మార్పు : కలెక్టర్‌
Collector Shyamprasad speaking at the adult education center

పుట్టపర్తి టౌన, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యమని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. పుట్టపర్తి గోకులం వీధిలో నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని గురువారం రాత్రి సందర్శించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో మాట్లాడారు. చదువు, డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తద్వారా మోసాలకు గురికాకుండా తమను తాము కాపాడుకోవచ్చునని అన్నారు. చదువు వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని, ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. పిల్లల చదువు ప్రాధాన్యాన్ని వివరించారు. అభ్యాసకులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వయోజన విద్య జిల్లా నోడల్‌ అధికారి జనార్దన గౌడ్‌, విద్యా సూపర్‌వైజర్లు, స్వచ్చభారత ఎంసీఓలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 06 , 2026 | 12:12 AM