పోటాపోటీగా రాతిదూలం లాగుడు పోటీలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:25 PM
మండలంలోని తొండపాడులో బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆరపళ్ల విభాగంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి.
గుత్తిరూరల్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని తొండపాడులో బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆరపళ్ల విభాగంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. ఈ పోటీల్లో 10 జతలు ఎద్దులు పాల్గొన్నాయి. నంద్యాల జిల్లా బేతంచెర్ల వాసి మేకలన్నకు చెందిన ఎద్దులు 5115 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.30 వేలు సాధించాయి. సత్యసాయి జిల్లా పులేటిపల్లి వాసి బాచ్చల బాస్కర్‌రెడ్డికి చెందిన ఎద్దులు 5105 అడుగులు లాగి రెండో మహుమతి రూ.20 వేలు కైవసం చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం కంచంపాడుకు చెందిన అంజిరెడ్డి ఎద్దులు 5104 అడుగులు లాగి మూడో మహుమతి రూ.15 వేలు సాధించాయి.