Share News

కోమటికుంట్ల చెరువుకు నీటి విడుదల

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:26 AM

మండల కేంద్రంలోని ఏల్లోజి పంతులు చెరువు నుంచి కోమటికుంట్ల చెరువుకు హెచ్చెల్సీ నీటిని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ శుక్రవారం విడుదల చేశారు.

కోమటికుంట్ల చెరువుకు నీటి విడుదల
నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

పుట్లూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఏల్లోజి పంతులు చెరువు నుంచి కోమటికుంట్ల చెరువుకు హెచ్చెల్సీ నీటిని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ శుక్రవారం విడుదల చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు నీళ్లు రావని అసత్య ప్రచారం చేశారని, ఆ నాయకులు ఒకసారి మండలానికి వచ్చి చూడాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగు, సాగు నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీనివాసులునాయుడు, నాయకులు నంబూరి శ్వేత, కులశేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు గోవర్దనరాజు, డిసి్ట్రబ్యూటర్‌ చైర్‌పర్సన ప్రమీలమ్మ, రామచంద్రనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:26 AM