వైభవంగా మైలార లింగేశ్వరస్వామి రథోత్సవం
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:27 AM
మండలంలోని తెనగల్లులో మైలార లింగేశ్వరస్వామి రథోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు
కుందుర్పి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని తెనగల్లులో మైలార లింగేశ్వరస్వామి రథోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించారు. 110 సంవత్సరాలుగా ఏటా నిర్వహిస్తున్న ఈ రథోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథోత్సవాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు.