Share News

TEMPLE: అభివృద్ధి జాడలేని కాటకోటేశ్వరం

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:57 PM

కాకిముట్టని క్షేత్రంగా మండలంలోని చిల్లవారిపల్లి సమీపంలోని కాటకోటేశ్వరం, కోరిన కోర్కెలు తీర్చే దేవు డిగా అక్కడ వెలసిన కాటకోటేశ్వరు డు ప్రసిద్ధి. ప్రతి ఆది, సోమవారాలు స్వా మికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వ హిస్తారు.

TEMPLE: అభివృద్ధి జాడలేని కాటకోటేశ్వరం
An undeveloped temple

- శివరాత్రి సమీపిస్తున్నా సాగని పనులు

- పాత డిపాజిట్లకు తేలని లెక్కలు

ధర్మవరం/తాడిమర్రి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కాకిముట్టని క్షేత్రంగా మండలంలోని చిల్లవారిపల్లి సమీపంలోని కాటకోటేశ్వరం, కోరిన కోర్కెలు తీర్చే దేవు డిగా అక్కడ వెలసిన కాటకోటేశ్వరు డు ప్రసిద్ధి. ప్రతి ఆది, సోమవారాలు స్వా మికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వ హిస్తారు. ప్రతి యేటా మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వ హిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. మహాశిరాత్రి పర్వదినం వస్తుం దంటే చాలు కాటకోటేశ్వర స్వామి ఆల య ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహిం చేందుకు ముందుగా ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సా గుతాయి. అయితే ఈ సంవత్సరం మరో పది రోజుల్లో మహాశివరాత్రి. అయినా ఏర్పాట్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఆలయానికి ప్రతి యేటా రూ. లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిందంటే చాలు ఆలయంలో పెత్తనం కోసం రెండు వర్గాల వారు పోటీ పడతారు. ఉద్రిక్తత పరిస్థితుల వరకు తీసుకెళ్తారు. దీంతో కొన్నేళ్లుగా ఇక్కడ ఉత్సవాల సందర్భంగా ఒక డీఎస్పీ పర్య వేక్షణలో ఐద గురు సీఐలు, ఐదు గురు ఎస్‌ఐలు,


దాదాపు 200 మం ది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారు. గత ఏడాది అప్పటి ఎస్పీ రత్న శివరాత్రి రోజు అర్దరాత్రి వేళ చిల్లవారిపల్లికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి వచ్చింది. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అటు నాయకులు, ఇటు దేవదాయ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టక పోవడంతో ప్రతి యేటా ఇలా జరుగుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రతి యేటా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రోజూ కనీసం 40 వేల నుంచి 50 వేల వరకు భక్తులు తరలివస్తారు. అందులో మహిళలే అఽధికం. వారికి అవసరమయ్యే స్నానపు గదులు, దుస్తులు మార్చు కునేందుకు ఏర్పాట్లు కూడా లేవు. సరైన తాగునీటి సౌకర్యం లేదు. ఆలయ ప్రాంగణంలో గదే గుండం వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. ప్రతి ఏటా ఉత్సవాలకు కనీసం రూ. 2లక్షలు ఖర్చు చేస్తారు.

తేలని లెక్కలు: కాటకోటేశ్వరస్వామి క్షేత్రానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నిల్వలకు సరైన లెక్క లులేనట్లుగా తెలిసింది. 2012లో నాలుగు ఖాతాల్లో కలిపి రూ.17.19లక్షలు డబ్బు ఉన్నట్లు అప్పట్లో తేల్చా రు. అప్పటి నుంచి ఆలయ ఆదాయం పెరుగుతోం దే కానీ తగ్గలేదు. 2014 లెక్కల ప్రకారం 106 కేజీల వెండి అభరణాలు ఉండగా 15 రోజుల క్రితం జరిగిన ఆడిట్‌లో 201 కేజీల వెండి ఉన్న ట్టుగా తేల్చారు. అదేవి ధంగా నగదు కూడా పెరగాల్సి ఉంది.


కానీ ఇప్పుడు ఆ ఖాతాల్లో కేవలం రూ.4లక్షలు మాత్రమే ఉన్నట్లుగా తేల్చా రు. గడిచన తొమ్మిదేళ్ల కాలంలో ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అభి వృద్ధి పనులు జరుగలేదు. మరి నిధులు ఏమయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై దేవదాయశాఖ అధికారులు సమాదానం చె పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా నాయకులు,ఽ అధికారులు చొరవ చూపి భక్తుల మనోబావాలు దెబ్బతినకుండా ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది.

పనులు ప్రారంభించాం - వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ

2025 సంవత్సరంలో ఆలయాన్ని దేవదాయశాఖకు పూర్తిగా అప్ప గించారు. అప్పటి నుంచి రూ.12లక్షలు ఆదాయం వచ్చింది. అంతకు మునుపు రూ.4లక్షలు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్‌ ఉంది. ఈ యే డాది శివరాత్రి ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలో సీసీ కెమరాలు, బారికేడ్ల ఏర్పాట్లను మొదలు పెట్టాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 05 , 2026 | 11:57 PM