Share News

VEHICLES: పోలీస్‌శాఖకు ఐదు వాహనాలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:05 AM

సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) ఫండ్‌ కింద పుట్టపర్తి పోలీసు సబ్‌డివిజనకు ఐదు నూతన వాహనాలు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్‌, ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు.

VEHICLES: పోలీస్‌శాఖకు ఐదు వాహనాలు
MLA Palle Sindhura Reddy waving the flag and starting the vehicles

- సీఎస్‌ఆర్‌ఎఫ్‌ కింద అందజేత

పుట్టపర్తి రూరల్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) ఫండ్‌ కింద పుట్టపర్తి పోలీసు సబ్‌డివిజనకు ఐదు నూతన వాహనాలు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్‌, ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ వాహనాలు పాతవవడంతో అత్యవసర సమయంలో మారుమూల ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. ఈ సమస్యలను ఎమ్యెల్యే, మాజీమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి పోలీసుశాఖకు నూతన వాహనాలు అందచేయడంలో కృషి చేశారన్నారు. అందుబాటులోకి వచ్చిన వాహనాలను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు. ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ అవిశ్రాంత సేవలందిస్తున్న పోలీసు యంత్రాం గానికి తమవంతు సహకారం అందించడంలో భాగంగా ఈవాహనాలను అందచేయడం సంతోషంగా ఉందన్నారు. మాజీమంత్రి పల్లె మా ట్లాడుతూ... పోలీసు వాహనాలను సమకూర్చడంలో సహకరించిన ప్రశాంతిగ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు రాజీవ్‌, బిల్డర్లు సాయికృష్ణ, ప్రదీప్‌ పెనకలపాటి, సాయికుమార్‌, బయన్న, భువనేశ్వర్‌లను జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే, మాజీమంత్రి సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ విజయ్‌కుమార్‌, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాసులు, సురేష్‌కుమార్‌, మారుతీశంకర్‌, నరేంద్రరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, ఆర్‌ఐలు వలి, మహేశ రవికుమార్‌, ఎస్‌ఐలు కూటమినాయకులు సామకోటి ఆదినారాయణ, పత్తిచలపతి, అబ్దుల్‌, శ్రీరామిరెడ్డి, విజయ్‌కుమార్‌ పలువురు మండల కన్వీనర్లు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 06 , 2026 | 12:05 AM