Share News

ఇంటి పట్టాల పంపిణీఇంటి పట్టాల పంపిణీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:26 PM

మండలంలోని 560 మందికి ఇంటిపట్టాలను రాయదుర్గంలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు గురువారం అందజేసినట్లు తహశీల్దార్‌ బ్రహ్మయ్య, డిప్యూటీ తహశీల్దార్‌ విశ్వనాథ్‌ తెలిపారు.

ఇంటి పట్టాల పంపిణీఇంటి పట్టాల పంపిణీ
రాయదుర్గం వెళ్తున్న కణేకల్లు మండల లబ్ధిదారులు

కణేకల్లు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని 560 మందికి ఇంటిపట్టాలను రాయదుర్గంలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు గురువారం అందజేసినట్లు తహశీల్దార్‌ బ్రహ్మయ్య, డిప్యూటీ తహశీల్దార్‌ విశ్వనాథ్‌ తెలిపారు. మొత్తం 18 పంచాయతీలలో 10.71 ఎకరాలు మేర పట్టాలు ఇచ్చారని, వీటి విలువ రూ. 6,62 కోట్ల ఉంటుందని వారు తెలిపారు.

బొమ్మనహాళ్‌ : మండలంలోని 572 మందికి విప్‌ కాలవ శ్రీనివాసులు పట్టాలు పంపిణీ చేసినట్లు తహసీల్దార్‌ మునివేలు తెలిపారు. ఇందులో ఉద్ధేహాళ్‌ సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికార్జున, వీఆర్‌ఓలు నరసింహమూర్తి, సుజాత, యుగంధర, శ్రీధరఘట్ట సోసైటీ చైర్మన ఏర్రిస్వామి, టీడీపీ నాయకులు నవీన, రవిచంద్రసాగర్‌, సైకిల్‌ షాప్‌ హనుమంత, సంగప్ప పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:26 PM