Share News

విరుపాపల్లి రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:24 PM

మండలంలోని వెంకటాద్రిపల్లి - విరుపాపల్లి రోడ్డు పదేళ్లుగా శిథిలావస్థలో ఉంది. 5.16 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వెంకటాద్రిపల్లి, శిర్పి, విరుపాపల్లి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

విరుపాపల్లి రోడ్డుకు మోక్షం
కంకర తేలిన విరుపాపల్లి రహదారి

బెళుగుప్ప, ఫిబ్రవరి 5 : మండలంలోని వెంకటాద్రిపల్లి - విరుపాపల్లి రోడ్డు పదేళ్లుగా శిథిలావస్థలో ఉంది. 5.16 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వెంకటాద్రిపల్లి, శిర్పి, విరుపాపల్లి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కంకర తేలి ఉండటంతో కాలినడకన వెళ్లాలన్నా వీలయ్యేకాదు. ఈ సమస్యను టీడీపీ నాయకులు ఇటీవల మంత్రి పయ్యావుల కేశవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఆ రోడ్డు మరమ్మతులకు రూ. 3.50 లక్షలు మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసిందని డీఈ మదనమోహన తెలిపారు.

Updated Date - Feb 05 , 2026 | 11:24 PM