పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.
పొగాకు ఉత్పత్తుల వినియోగంతో శరీర దృఢత్వాన్ని కోల్పోతారని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీరాములు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జేఎనటీయూలో క్రీడాకారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక డంపింగ్ యార్డ్ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనంతపురం అర్బనలో ప్రజలకు రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.
సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా కలిశాయి.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటివెంకటేశ్వరప్రసాద్ అన్నారు. శుక్రవారం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు అర్జీలు సమర్పించారు.
భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్ వెల్పేర్ కౌన్సిల్ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.