ముగిసిన అంజన్న ఉత్సవాలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:54 PM
మండలంలోని బూదిగుమ్మలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంజనేయస్వామి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.
బెళుగుప్ప, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని బూదిగుమ్మలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంజనేయస్వామి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఆలయ సమీపంలోని పెన్నానదిలో భక్తులు మాఘస్నానం ఆచరించి ఒడ్డున అశ్వర్థ కట్ట వద్ద గంగపూజలు చేశారు. నది ఒడ్డున ఉన్న కాలువపల్లి వీరాంజనేయ కొట్టాల గ్రామస్థులు నదిలో గంగపూజ ఆంజనేయస్వామికి పూజలు చేశారు. వేదపండితులు సుందరకాండ హోమం నిర్వహించారు. ఎంఎంకేజీ సిప్లాన గ్రూప్ ఛైర్మన రాళ్లపల్లి అనంతయ్య అన్నప్రసాదం అందజేశారు. ఇందులో చిత్తూరు జిల్లా డీఎస్పీ టి సాయినాథ్, ఆలయ కమిటీ ఛైర్మన టి యర్రిస్వామి, ఆలయ ఛైర్మన శంకరప్ప పాల్గొన్నారు.