FESTIVAL: ఘనంగా అచ్చేమియా గంధోత్సవం
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:14 PM
మండలపరిధిలోని అచ్చేమియా పల్లిలో అచ్చేమియా దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండకమర్ల గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు జౌలీ అల్లా బకాష్ ఇంటి నుంచి ప్రత్యేకంగా ఒంటెలు, గుర్రాలపై గంధాన్ని ఫకీర్ల జల్సాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గా లోప్రార్థనలు చేశారు.
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని అచ్చేమియా పల్లిలో అచ్చేమియా దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండకమర్ల గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు జౌలీ అల్లా బకాష్ ఇంటి నుంచి ప్రత్యేకంగా ఒంటెలు, గుర్రాలపై గంధాన్ని ఫకీర్ల జల్సాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్కెస్ర్టాతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మండల నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉరుసు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే రోజు రాత్రికి ఖావ్వాలి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....