Share News

నెరవేరనున్న ఐదు దశాబ్దాల కల

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:52 PM

మండలానికి తూర్పున వైపున ఉన్న పది గ్రామాల ప్రజల 50 ఏళ్ల కల త్వరలోనే నెరవేరస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు.

నెరవేరనున్న ఐదు దశాబ్దాల కల
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న విప్‌ కాలవ

కణేకల్లు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మండలానికి తూర్పున వైపున ఉన్న పది గ్రామాల ప్రజల 50 ఏళ్ల కల త్వరలోనే నెరవేరస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక వేదావతి హగరిలో రూ. 6 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. మండలంలోని మాల్యం, సొల్లాపురం, హనుమాపురం, హనకనహాళ్‌, నాగేపల్లి, తుంబిగనూరు, గరుడచేడు మీండ్లపల్లి, బిదురకుంతం గ్రామాల ప్రజలకు ఈ వంతె నిర్మాణ ం వల్ల అనేక ఏళ్లుగా ఉన్న సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన హనుమంతరెడ్డి, పీఆర్‌ డీఈ సుధాకర్‌నాయక్‌, జేఈ మహేష్‌, టీడీపీ నాయకులు వన్నారెడ్డి, లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, వేలూరు మరియప్ప, సుదర్శన, ఆది, బీటీ రమేష్‌, షేక్‌ముజ్జు, చంద్రశేఖర్‌గుప్తా, చాంద్‌బాషా, నరేంద్ర, అనిల్‌, కురుబ నాగరాజు, ఆది, బసవరాజు, మాబుసాబ్‌, వెంకటేశులు, ప్రభాకర్‌, శరభనగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:52 PM