COLONY: కనీస సౌకర్యాలు కరువు
ABN , Publish Date - Feb 08 , 2026 | 10:42 PM
స్థానిక కస్తూర్బా కాలనీలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో అనంతపురం రోడ్డులో కస్తూర్బా కాలనీ ఉంది. స్థానిక కస్తూ ర్బా పాఠశాల సమీపంలో గత టీడీపీ హయాంలో ఈ కాలనీ ఏర్పడింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 2017 నుంచి ఇళ్ల నిర్మాణం జ రుగుతూనే ఉంది.
ఇబ్బందులు పడుతున్న కస్తూర్బా కాలనీ వాసులు
ముదిగుబ్బ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): స్థానిక కస్తూర్బా కాలనీలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో అనంతపురం రోడ్డులో కస్తూర్బా కాలనీ ఉంది. స్థానిక కస్తూ ర్బా పాఠశాల సమీపంలో గత టీడీపీ హయాంలో ఈ కాలనీ ఏర్పడింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 2017 నుంచి ఇళ్ల నిర్మాణం జ రుగుతూనే ఉంది. అతిపెద్ద కాలనీగా ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు 500 కుటుంబాలు ఉండగా, 2000 మంది వరకు జనాభా ఉంది. ఇది గ త టీడీపీ హయాంలో ఏర్పడిన కాలనీ కాబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం పట్టించుకోలేదు. అంతే గాకుండా పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
అప్పటి అధికారులు కస్తూర్బా కాలనీ వైపు చూడడమే మానేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులైన వీధి లైట్లు, విద్యుత స్తంభాలు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, ఇళ్లకు డోర్ నెంబర్లు, తాగునీటి సౌకర్యం లేక పోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కస్తూర్బా పాఠశాల సమీపంలో ఉన్న ట్రాన్సఫార్మర్‌కు ఎలాంటి కంచె ఏర్పాటు చేయలేదు. తక్కువ ఎత్తులో ఫీజులు అమర్చడంతో పాఠశాల విద్యార్థులు పొరపాటున వాటి ని తాకే ప్రమాదం ఉందని స్థానికులు వా పోతున్నారు. గత వైసీపీ ప్రభు త్వ హయాంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులతో పాటు మినీ హె ల్త్ సెంటర్, బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....