Share News

POND: మరువ పారుతున్న కుంట

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:55 PM

మండలంలోని రావుల చెరువు పంచాయతీలోని నాగిరెడ్డికుంట కొట్టాల గ్రామ సమీపాన ఉన్న కుంట నిండి మరువపారుతోంది. ధర్మవరం చెరువు నుంచి నీరు రావడం తో కుంట నిండింది. ఈ కుంట కింద సుమారు 50 వరకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి.

POND: మరువ పారుతున్న కుంట
Nagireddykuntakottala kunta which is flowing with rain

- పాచిపట్టిన రోడ్డు - వాహనాదారులూ... జాగ్రత్త

ధర్మవరం రూరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావుల చెరువు పంచాయతీలోని నాగిరెడ్డికుంట కొట్టాల గ్రామ సమీపాన ఉన్న కుంట నిండి మరువపారుతోంది. ధర్మవరం చెరువు నుంచి నీరు రావడం తో కుంట నిండింది. ఈ కుంట కింద సుమారు 50 వరకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి. కుంట నిండటంతో బోర్లలో నీరు సమృద్ధిగా వస్తోందని ఆ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా ఆ కుంటకు నీరు చేరలేదు. అయితే ఇటీవల హాంద్రీనీవా కాలువలోని కృష్ణా నీటితో ధర్మవరం చెరువు నిండి మరువపారింది. ఆ మరువ నీరు రావులచెరువు, నాగిరెడ్డికుంటకొట్టాల కుంటకు చేరింది. దీంతో కుంట జల కళను సంతరించుకుంది. కుంట నిండి నెలరోజులుగా మరువపారుతుం డటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రామాలకు వెళ్లే రోడ్డుపై నీరు పారుతుండటంతో పాచిపట్టి ద్విచక్రవా హనాలు జారుతున్నాయని, గ్రామాలకు కొత్తగా వచ్చేవారు జాగ్రత్తగా రావాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 08 , 2026 | 10:55 PM