MINISTER: కరాటేలో ప్రతిభా విద్యార్థులకు మంత్రి అభినందనలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:16 AM
జాతీయ స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అభినందించారు.
ధర్మవరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అభినందించారు. 2025-26 అకడమిక్ సంవత్సరంలో ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ జూడో, కరాటేలలో పథకాలు సాధించిన క్రీడాకారులు గవ్వల యువసంధ్య, కొండ అర్చన, వనం సింధు, సాకే దాక్షాయనిని మంత్రి అభినందించి, భవిష్యత్తులో మరింత రాణించి ఉన్నతస్థాయికి చేరు కోవాలని ఆకాంక్షించారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....