Share News

వైభవంగా ఏటిగంగమ్మ తిరునాళ్లు

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:53 PM

మండలంలోని పెన్నహోబిలం పెన్నానది వద్ద ఆదివారం ఏటిగంగమ్మ తిరునాళ్లును వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఏటిగంగమ్మ తిరునాళ్లు
పెన్నా నదిలో భక్తుల సందడి

ఉరవకొండ,ఫిబ్రవరి8(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెన్నహోబిలం పెన్నానది వద్ద ఆదివారం ఏటిగంగమ్మ తిరునాళ్లును వైభవంగా నిర్వహించారు. ఏటా మాఘమాసం మూడో వారం ఏటిగంగమ్మ తిరునాళ్లు నిర్వహించడం ఆనవాయితీ. అశ్వర్థనారాయణ కట్టకు భక్తులు పూజలను చేశారు. అలాగే ఏటిగంగమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను చేశారు. ఉత్సవమూర్తిని మేళతాళాల మధ్య ఊరేగించారు. పెన్నానదిలో భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పెన్నానది ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆకుకూరల నాగరాజు, వార్డు మెంబర్‌ వనజ అన్నసంతర్పణం చేశారు.

Updated Date - Feb 08 , 2026 | 11:53 PM