ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. లోకేశ్‌ను ప్రజలు, కార్యకర్తలు కలిసి.. తమ సమస్యలు విన్నవించుకున్నారు. వీటిని పరిష్కరిస్తానని వారికి మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్చల్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను ధ్వంసం చేయించారు. ఆస్పత్రిని అప్పగించాలని దాదాపు 30 మంది రౌడీమూకలతో బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత బెదిరించినట్లు తెలుస్తోంది.
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు.
మండల పరిధిలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఆదివా రం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి అపాయం కలుగ లేదు. అనంతపురం నుంచి కడపకు వెళ్తున్న పులివెందుల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, పార్నపల్లి నుంచి బత్తలపల్లి వైపు వె ళ్తున్న బొలేరోవాహనం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులి వెందుల బ్రాంచ కెనాల్ వద్ద ఢీకొన్నాయి.
స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్‌లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్ అంజనరెడ్డి, వైస్ ప్రసిడెంట్ అశోక్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్‌చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు.
మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు.
సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, అధికారులు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పూర్ణచంద్ర ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.