Share News

ఉత్సాహంగా క్రీడాపోటీలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:02 AM

స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఎస్‌ రావ్స్‌ మెమోరియల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను శుక్రవారం నిర్వహించారు.

 ఉత్సాహంగా క్రీడాపోటీలు
ట్రోఫీ అందజేస్తున్న ఆర్డీవో

గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఎస్‌ రావ్స్‌ మెమోరియల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఖోఖో, వాలీబాల్‌, రన్నింగ్‌, షార్ట్‌పుట్‌ తదితర పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆర్డీఓ ఏబీవీబీఎస్‌ శ్రీనివాస్‌ ఈ పోటీలను ప్రారంభించారు. ఓవరాల్‌ చాంపియనగా నిలిచిన రాజేంద్రనగర్‌లోని బ్రాంచ-1 జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఇందులో ఎంఈఓలు మస్తానరావు, సుబ్బరాయుడు, పాఠశాలల ఏజీఎం సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్స్‌ ఈరే్‌షబాబు, పురుషోత్తం, నారాయణస్వామి, విశ్వనాథ్‌, సమీనాఖాన పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:02 AM