TANK: పాచిపట్టిన నీటి ట్యాంకులు
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:50 PM
మండలంలోని మల్లాకాల్వ గ్రామంలో సత్యసాయి తాగునీటి ట్యాంకు వద్ద పాచిపట్టి ఆధ్వానంగా ఉంది. ట్యాంకు కొళాయిల వద్ద పాచిపట్టి ఉండటంతో జారిపడుతున్నామని ఆ గ్రామస్థులు తెలిపారు. తాగునీటి ట్యాంకు వద్ద శుభ్రం చేయకపోవడంతో, అక్కడ ఏర్పడిన అపరిశుభ్రతను తాగునీరు పట్టుకునేందుకు వెళ్లే మహిళలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
ధర్మవరంరూరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లాకాల్వ గ్రామంలో సత్యసాయి తాగునీటి ట్యాంకు వద్ద పాచిపట్టి ఆధ్వానంగా ఉంది. ట్యాంకు కొళాయిల వద్ద పాచిపట్టి ఉండటంతో జారిపడుతున్నామని ఆ గ్రామస్థులు తెలిపారు. తాగునీటి ట్యాంకు వద్ద శుభ్రం చేయకపోవడంతో, అక్కడ ఏర్పడిన అపరిశుభ్రతను తాగునీరు పట్టుకునేందుకు వెళ్లే మహిళలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అధికా రులు ట్యాంకులు శు భ్రం చేయకపోవడంతో పాచిపడుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గాండ్లపెంట: మండల పరిఽధిలోని వేపరాళ్ల పంచాయతీ ఎస్సీ కాలనీలో ట్యాంక్ వద్ద నీరు లీకేజీ అవుతోంది. దీంతో ట్యాంకు వద్ద పాచి పట్టినా లీకేజీ వద్ద పునరుద్ధరణ గురించి ఎవరూ పట్టించుకోవ డం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామాల్లో తాగునీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం పంచాయతీలకు రూ. లక్షల నిధులు అందిస్తున్నా, గ్రామంలో తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, పరిశుభ్రత గురించి అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు విమర్శి స్తున్నారు. తెలుపుతున్నారు. ట్యాంక్ వద్ద నిత్యం పైపుల లీకేజీతో ఇలా పాచిపట్టి ఉంటే రోగాల భారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....