Share News

CM: థ్యాంక్యూ... సీఎం సార్‌

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:07 AM

ఏపీ 108 ఆంబులెన్స సర్వీస్‌లో ఉద్యోగులుగా పని చేస్తున్న ఈఎంటీ లు, పైలెట్లుకు జీతాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం 108 వాహనం ఎదురుగా ‘థ్యాంక్యూ... సీఎం సార్‌’ అంటూ ప్లకా ర్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న త మ జీతానికి అదనంగా నెలకు రూ. 2 వేలు పెంచిం దని హర్షం వ్యక్తం చేశారు.

CM: థ్యాంక్యూ... సీఎం సార్‌
Nambulapulakunta Sibandi thanking the CM

- జీతాల పెంపుపై 108 సిబ్బంది హర్షం

ముదిగుబ్బ/ నంబులపూలకుంట, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఏపీ 108 ఆంబులెన్స సర్వీస్‌లో ఉద్యోగులుగా పని చేస్తున్న ఈఎంటీ లు, పైలెట్లుకు జీతాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం 108 వాహనం ఎదురుగా ‘థ్యాంక్యూ... సీఎం సార్‌’ అంటూ ప్లకా ర్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న త మ జీతానికి అదనంగా నెలకు రూ. 2 వేలు పెంచిం దని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఐదేళ్లు, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్‌ స్లాబ్‌ అప్‌గ్రేడేషన చేయాలని తీసుకున్న నిర్ణయంతో త మకు ఆర్థిక వెసలుబాటు కలుగుతుందన్నారు. విధులు నిర్వహించే వా హనం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 108 సిబ్బంది మల్లేష్‌, రవి, నారాయణస్వామి నాయక్‌, బాల ఓబిలేసు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. అలాగే నంబులపూలకుంటలో 108 సిబ్బంది సాంబశివ, ప్రసాద్‌రెడ్డి, రెడ్డెప్ప, పవనకుమార్‌ తదితరు లు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 14 , 2026 | 12:07 AM