Share News

సపోట, కొబ్బరి చెట్లకు నిప్పు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:03 AM

కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధి పూర్ణానందస్వామి ఆలయం సమీపంలోని నాగభూషణానికి చెందిన తోటలోని సపోట, కొబ్బరి చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.

సపోట, కొబ్బరి చెట్లకు నిప్పు
మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

కళ్యాణదుర్గంరూరల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధి పూర్ణానందస్వామి ఆలయం సమీపంలోని నాగభూషణానికి చెందిన తోటలోని సపోట, కొబ్బరి చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరి మంటలను అదుపుచేసింది. సుమారు రూ. 70 వేలు ఆస్తినష్టం సంభవించినట్లు బాధిత రైతు నాగభూషణం తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 12:03 AM