Share News

SHIVARATHRI: శివరాత్రికి ఆలయాల ముస్తాబు

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:47 PM

మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి జరగను న్నాయి. ఆదివారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు గణపతి పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభి షేకం, హోమం నిర్వహించి స్వామి వారిని అలంకరిస్తారు.

SHIVARATHRI: శివరాత్రికి ఆలయాల ముస్తాబు
Kunuthuru temple

తాడిమర్రి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి జరగను న్నాయి. ఆదివారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు గణపతి పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభి షేకం, హోమం నిర్వహించి స్వామి వారిని అలంకరిస్తారు. సాయంత్రం చిల్లవారిపల్లి నుంచి ఎలవగంపల్లో స్వామి ఆభరణాలను ఉంచి ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. అర్ధరా త్రి సమయంలో గదే గుండం వద్ద ఎలవ గంపలను పూజించి ఊరేగిస్తారు. తిరిగి సోమవారం ఉదయం గదే గుండం సమీ పం నుంచి స్వామివారి ఆలయం వరకు ఊరే గింపుగా వచ్చి అగ్నిగుండ ప్రవేశం చేయిస్తారు. తిరిగి స్వామి అభరణాలను చిల్లవారిపల్లికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారన్న ఉద్దేశ్యంతో ముందుగానే వసతి సముదాయాలను, అన్నదాన కేంద్రాన్ని, ఆలయ పరిసరాలను శుభ్రం చేసి రంగులు వేశారు.


భక్తులు స్వామి దర్శ నం చేసుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటుచే శారు. ఉత్సవాల ఏర్పాట్లను బీజేపీ నియోజక వర్గ ఇనచార్జ్‌ హరీశబాబు శనివారం పరిశీ లించారు. మంత్రి సత్యకుమారయాదవ్‌ ఆది వారం కాటకోటేశ్వరక్షేత్రంలో జరిగే ఉత్సవాల లో పాల్గొంటారని ఆయన తెలిపారు.

అన్నదానానికి రూ. 2లక్షల విరాళం: కాటకోటేశ్వర క్షేత్రంలో నిర్వహించే అన్నదానా నికి పార్నపల్లికి చెందిన జేఎల్‌ కన్సస్ట్రక్షన్స యజమాని ధనుంజయనాయుడు, కుటుంబ సభ్యులు రూ.2లక్షలు విరాళం అందించారు. మరికొంత మంది భక్తులు అన్నదాన కేంద్రానికి తమ వంతు సాయం అందజేశారు.

ధర్మవరంరూరల్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరిం చుకుని ఆదివారం వేడుకలకు మండలంలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. కుణుతూరులోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శైవక్షేత్రం త్రికూట దేవాలయమైన చంద్ర మౌళీ శ్వర ఆలయాన్ని అంగరంగవైభవంగా ముస్తాబు చేశారు. ఆలయంలో పార్వతి చంద్రమౌళీశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, గ్రా మస్థులు తెలిపారు. రాత్రికి అన్నదానంతో పాటు జాగరణ చేసేందుకు ఆలయం వద్ద భజనలు, నాటికలు తదితర ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. అలాగే మండలంలోని వసంతపురం గ్రామంలో వెలసిన తిక్కయ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త తరుణ్‌రెడ్డి, పూజారి సిద్దయ్య శనివారం తెలిపారు. రాత్రి వీరబ్రహ్మేంద్రస్వామి జీవితచరిత్రపై సందేశాత్మక నాటక ప్రదర్శన ఉటుందని తెలిపారు. అన్నదానం చేపడుతామన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 14 , 2026 | 11:47 PM