ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం ఒక్కరోజులోనే ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.
ఇప్పటికే అయ్యప్ప మాల ధారణ అన్నిచోట్ల ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారులు దీక్షలో ఉన్న రోజుల్లో నిత్యాన్నదానం అందించి ఆదర్శంగా నిలుస్తోంది ముదిగుబ్బ శ్రీపంచగిరీశ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోం ది.
తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సొంత నిధులు రూ. 70వేలతో పూర్వ విద్యార్థి, జనసేన మండల కార్యదర్శి కొండబోయన సతీష్ డయాస్ నిర్మాణ పనులను చేపట్టారు.
సత్యసాయిబాబా సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని యాదవవీధిలో సత్యసాయిబాబా శతజయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్ర మాలకు ముఖ్యఅతిఽథులుగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చేనేతప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ హాజరయ్యారు.
రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్, కదిరి, కొత్తచెరువు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, నల్లమాడ మండలాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సోమవారం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించారు.
సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రశాంతి నిలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హిల్‌వ్యూ స్టేడియంలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సత్యసాయి బాబా చిత్రపటాన్ని ...