Share News

ఎణ్ణే రంగనాథేశ్వరుడి ఉత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:47 PM

మండలంలోని గోవిందవాడంలో ఎణ్ణేరంనాథేశ్వరస్వామి వారి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

ఎణ్ణే రంగనాథేశ్వరుడి ఉత్సవాలు ప్రారంభం
గంగాజలం తీసుకొస్తున్న భక్తులు

బొమ్మనహాళ్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందవాడంలో ఎణ్ణేరంనాథేశ్వరస్వామి వారి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం గంగాజలం తెచ్చి ఆలయంలోని స్వామివారిని అభిషేకించారు. అలాగే ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - Feb 16 , 2026 | 11:47 PM