విశ్వా.. చిల్లర రాజకీయాలు మానుకో
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:44 PM
మీ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. అయినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదు. ఆ ప్రభుత్వ పాలనలో ఏ నాడూ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు
బెళుగుప్ప, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘మీ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. అయినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదు. ఆ ప్రభుత్వ పాలనలో ఏ నాడూ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు. నేడు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అయినా స్థానిక వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లేనిపోని విమర్శలు చేస్తూ.. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. మీ విమర్శలను ప్రజలు నమ్మె స్థితిలో లేరు. మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా..’ అని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు పెద్ద తిప్పయ్య, దుద్దేకుంట తిమ్మప్ప, మల్లికార్జున, సునీల్, రాము, జయరాములు, మారెప్ప, నారాయణ స్వామి మాట్లాడారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి అయినా చేశారా అని నిలదీశారు. రామసాగరం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని.. త్వరలో పనులు ప్రారంభిస్తామని, వంతెన నిర్మించిన తర్వాతే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.