Share News

అడుగంటిన భూగర్భ జలాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:55 PM

ఖరీ్‌ఫకు మిన్నగా రబీలో ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు బోరుబావుల కింద అనేక రకాల పంటలు సాగు చేసేవారు.

అడుగంటిన భూగర్భ జలాలు
కరిగానపల్లి వద్ద బోరు వేస్తున్న దృశ్యం

కుందుర్పి, ఫిబ్రవరి16(ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫకు మిన్నగా రబీలో ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు బోరుబావుల కింద అనేక రకాల పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావం దృష్ట్యా వాగులు, వంకలు, చెరువులకు చుక్కనీరు చేరని పరిస్థితి నెలకొంది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరుబావుల్లో నీరు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. నీటి తడులు అందించక పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకోవాలని రైతులు మరీ అప్పులు బోరుబావులను తవ్విస్తున్నారు. 800 అడుగులు బోరు తవ్వించిన చుక్కనీరు బయటకి రావడం లేదు. దీంతో చాలామంది రైతులు వ్యవసాయం మానేసి.. కూలీ పనులకు వెళ్తున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:55 PM