త్వరలో వంతెన పనులు పునఃప్రారంభం: విప్
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:43 PM
మండల కేంద్రం నుంచి ఉరవకొండకు వెళ్లే మార్గ మధ్యలో రూ.48 కోట్లతో ప్రారంభించిన బ్రిడ్జి పనులను.. త్వరలోనే పునః ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఎనసీ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు
కణేకల్లు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి ఉరవకొండకు వెళ్లే మార్గ మధ్యలో రూ.48 కోట్లతో ప్రారంభించిన బ్రిడ్జి పనులను.. త్వరలోనే పునః ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఎనసీ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. ఆగిపోయిన ఆ వంతెన నిర్మాణ పనులను సోమవారం వారు పరిశీలించారు. విప్ మాట్లాడుతూ.. బ్రిడ్జి పిల్లర్లు వేసే ప్రాంతంలో శ్రీరామిరెడ్డి పైపులైనలు ఉండడం, భూసేకరణ, అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సిన అంశాలతో పనులు ఆగిపోయాయన్నారు. ఈ విషయాన్ని మూడురోజుల క్రితం రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖమంత్రి జనార్ధనరెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో ఈఎనసీ క్షేత్రస్థాయిలో బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చారన్నారు. వారి వెంట ఎస్‌ఈ మురళీకృష్ణ, ఈఈ జయప్రసాద్‌రెడ్డి, డీఈ రవిశంకర్‌రెడ్డి, జేఈ నాగేంద్రప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు వన్నారెడ్డి, లాలెప్ప, ఆనంద్‌రాజ్, షేక్‌ఫకృద్ధీన, ఆది, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, అనిల్, చాంద్‌బాష, మాబుసాబ్, వెంకటేశులు పాల్గొన్నారు.