Share News

ఎట్టకేలకు మోక్షం

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:15 AM

ఏళ్ల తరబడి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రాయదుర్గం పట్టణంలోని పలు కాలనీ వాసులకు మోక్షం లభించింది.

ఎట్టకేలకు మోక్షం
రాయదుర్గంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు

రాయదుర్గం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రాయదుర్గం పట్టణంలోని పలు కాలనీ వాసులకు మోక్షం లభించింది. విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చొరవతో పలు కాలనీల్లో సమస్యలను పరిష్కరించడంతో పాటు.. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. గుంతలమయంగా ఉన్న పట్టణంలోని రోడ్ల స్థానంలో.. సీసీ రోడ్లు.. మురుగుకాలవలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని పురపాలక సంఘం పరిధిలోని 32 వార్డులకు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతలో రూ. 90 లక్షలు, రెండోవిడతలో మరో రూ. 90 లక్షలు మంజూరయ్యాయి. వీటితో పాటు మరో రూ. 60 లక్షలతో ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ కింద మంజూరయ్యాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి పట్టణంలో జోరుగా రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టారు. కూరగాయల మార్కెట్‌ వద్ద రూ. 7 లక్షలతో, కూరగాయల మార్కెట్‌ వెనుక రూ. 23 లక్షలతో, శాంతినగర్‌లోని అయ్యప్పస్వామి దేవాలయం వరకు రూ. 18 లక్షలతో, గణపతి గుడి వెనుక రూ. 5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అలాగే వెంకటేశ్వర కాలనీలో రూ. 30 లక్షలతో మురుగు కాలువల నిర్మాణం, రూ. 30 లక్షల మేరకు హెచటీ విద్యుత బిల్లుల బకాయిల చెల్లింపు, మరో రూ. 30 లక్షలతో టీ వీరాపురం, కణేకల్లు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు ప్రహరీలను నిర్మించారు.

Updated Date - Feb 16 , 2026 | 12:15 AM