బోర్లకు మరమ్మతులు చేయించండి
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:16 AM
మండలంలోని శింగానహళ్లి, దేవగిరి గ్రామాల్లో పలు చేతిపంపులు పని చేయడం లేదు.
బొమ్మనహాళ్, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని శింగానహళ్లి, దేవగిరి గ్రామాల్లో పలు చేతిపంపులు పని చేయడం లేదు. వేసవిలో విద్యుత, తాగునీటి సమస్యలు వచ్చినప్పుడు ... ఆ గ్రామస్థులకు ఈ బోర్ల నీరే ఆధారం. రానున్న వేసవిలో తాగునీటి సమస్య వస్తే.. ఎలా అని ఆ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా.. వారి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇక వేసవితో తాగునీటి సమస్య వస్తే.. కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయబోర్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ చేతిబోర్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.