శివాలయం అభివృద్ధికి రూ.లక్ష
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:18 AM
స్థానిక శివాలయం అభివృద్ధికి రూ. లక్షను బెళుగుప్పకు చెందిన టీడీపీ నాయకుడు పెద్ద తిప్పయ్య ఇచ్చారు.
బెళుగుప్ప, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : స్థానిక శివాలయం అభివృద్ధికి రూ. లక్షను బెళుగుప్పకు చెందిన టీడీపీ నాయకుడు పెద్ద తిప్పయ్య ఇచ్చారు. ఆ ఆలయ కమిటీకి ఆ చెక్కును ఆదివారం అందజేశారు. గత యేడాది రూ. లక్ష ఇచ్చానని, ఆ సారీ ఇచ్చానని, తాను ఉన్నంతవరకు ఏటా ఆలయ అభివృద్ధికి రూ. లక్ష ఇస్తానని పెద్ద తిప్పయ్య తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం విశేషమన్నారు. అనంతరం పెద్ద తిప్పయ్య, అతని భార్య, ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు సన్మానించారు.