Share News

రేపటినుంచి మళ్ళీ వర్షాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:08 AM

తమిళనాడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. దీంతో నవంబరు ఒకటో తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కోవై, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రేపటినుంచి మళ్ళీ వర్షాలు
Rains, Chennai

  • వాతావరణ శాఖ హెచ్చరిక

చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. దీంతో నవంబరు ఒకటో తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కోవై, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం కేంద్రీకృతమైవుంది. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయానికి దక్షిణ అండమాన్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలో కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం,


nani1.2.jpgఅండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దాని కారణంగా శనివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదిలావుంటే, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలో సాధారణం కంటే 37 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొత్తగా అల్పపీడనం, వాయుగుండం ఏర్పడటంతో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్య నియంత్రణకు సీఏక్యూఎం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 11:08 AM