Share News

విద్యార్థుల పార్టీలో గంజాయి!

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:19 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట పరిధిలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌ గుట్టుగా వీకెండ్‌ పార్టీ జరుగుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు.

విద్యార్థుల పార్టీలో గంజాయి!
Chevella Police Raids

  • చేవెళ్ల సమీపంలోని ఫామ్‌హౌస్‌లో 108 మంది విద్యార్థుల వీకెండ్‌ పార్టీ

  • వీరిలో 37 మంది యువతులు

  • అంతా ఇక్ఫాయ్‌ కాలేజీలకు చెందిన వారే

  • పోలీసుల దాడి.. పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌

  • 15 గ్రాముల గంజాయి.. మద్యం బాటిళ్ల స్వాధీనం

  • 7కార్లు, 3 బైక్‌లు, 70 సెల్‌ఫోన్లు కూడా

చేవెళ్ల(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట పరిధిలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌ శుక్రవారం సాయంత్రం గుట్టుగా వీకెండ్‌ పార్టీ జరుగుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ పార్టీలో 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 37 మంది యువతులు ఉన్నారు. అందరికీ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులంతా శంకర్‌పల్లి మండల పరిధిలోని ఇక్పాయ్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనాలసిస్‌ ఆఫ్‌ ఇండియా) వర్సిటీ పరిధిలోని బీబీఏ, ఇంజనీరింగ్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులేనని పోలీసులు చెప్పారు.


ganja1.jpgఘటనాస్థలి నుంచి 15 గ్రాముల గంజాయి, పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, ఏడు కార్లు, మూడు బైక్‌లు, 70 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల సీఐ నరేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇక్ఫాయ్‌కి చెందిన మన్నన్‌ అనే వ్యక్తి, ఎల్జీ ఫామ్‌హౌస్‌లో అక్టోబరు 30న వీకెంట్‌ పార్టీ ఉందంటూ విద్యార్థులకు గతంలోనే వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టాడు. వీకెండ్‌ పార్టీ కోసం విద్యార్థుల నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2వేల దాకా వసూలు చేశాడు. శుక్రవారం ఉదయం పార్టీ జరిగే ఎల్‌జీ ఫామ్‌హౌస్‌ లొకేషన్‌ పెట్టాడు. పార్టీ జరుగుతోందన్న సమాచారం తెలుసుకున్న ఎస్‌వోటీ, చేవెళ్ల పోలీసులు ఆ ఫామ్‌హౌ్‌సపై దాడి చేశారు. పోలీసులను చూసి విద్యార్థులు ఫాంహౌస్‌ నుంచి బయటకు పరుగులు తీశారు.


wine1.jpgవిద్యార్థులందరినీ పట్టుకున్న పోలీసులు, వారిని ఓ చోట కూర్చోబెట్టారు. వారికి పరీక్షలు నిర్వహించగా నలుగురు గంజాయి తీసుకున్నట్లుగా తేలింది. ఘటనపై కేసు నమోదు చేశారు. పార్టీ నిర్వహించిన ప్రధాన నిందితుడు మన్నన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలోకి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తెచ్చారు? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ఎల్‌జీ ఫాంహౌస్‌ను కమ్మెట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నారు. ఇక్కడ రేవ్‌, మూజ్రా పార్టీలు, పేకాట, కోడి పందాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిసింది. యువకకులను ఆకర్షించేలా ఫామ్‌హౌస్ లో హుక్కా గంజాయి, డ్రగ్స్‌ వినియోగం జరుగుతోందని సమచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్‌సాగర్‌లో నీటికాలుష్యం..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 10:19 AM