Share News

తమిళనాడులోని 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:42 PM

నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తమిళనాడులోని 11 జిల్లాలకు భారీ వర్ష సూచన
Tamil Nadu Rain Alert

  • వాతావరణ కేంద్రం హెచ్చరిక

చెన్నై: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో నెలకొన్న ద్రోణి ఉత్తర కేరళం నుంచి కర్ణాటక వరకు తీర ప్రాంతానికి నెమ్మదిగా కదులుతున్న కారణంగా సోమవారం ఉదయం రాజధాని నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.


nani1.2.jpgతిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, తిరుపత్తూరు, విల్లుపురం, కడలూరు, తంజావూరు, తిరువారూర్‌, మైలాడుదురై, నాగపట్టినం జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, కరూర్‌, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోని కారైక్కాల్‌లో ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరే అవకాశముందని తెలిపింది. కాగా, నగరంలో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. ఎగ్మూర్‌, పురుషవాక్కం, నుంగంబాక్కం, కోడంబాక్కం, టి.నగర్‌, చేట్‌పేట్‌, అమింజికరై, కొడుంగైయూర్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవడంతో రహదారుల్లో నీరు చేరింది.


సేలం, తిరుపత్తూరు, వేలూరు, తిరువణ్ణామలై, కళ్లకురుచ్చి, నామక్కల్‌, కరూర్‌, అరియలూరు, పుదుకోట, మదురై, శివగంగ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి బలపడిన తర్వాత దాని ప్రయాణ దిశ, తీవ్రతను బట్టి రాష్ట్రంపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చేవరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులపై వచ్చే తాజా సమాచారాన్ని గమనించాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా వుండగా, గత కొన్ని రోజులుగా మంచు దట్టంగా వ్యాపిస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. సహజంగా డిసెంబరులో కురవాల్సిన మంచు ఈ ఏడాది ముందుగానే కురుస్తుండడంతో రాత్రి, ఉదయం సమయాల్లో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా కలెక్టర్‌ను మీ ఎమ్మెల్యే వేధిస్తుంటే ఏం చేస్తున్నారు?

ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బీజేపీ-అకాలీదళ్..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 01:42 PM