Share News

30న మరో అల్పపీడనం

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:52 PM

ఈ నెల 30న దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముంది.

30న మరో అల్పపీడనం
Heavy Rains

  • తుపానుగా మారే అవకాశం...?

చెన్నై: ఈ నెల 30న దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముంది. అంతే కాకుండా వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశాలు తక్కువగా ఉన్నందున, దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమల జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమై 45 రోజులు గడిచినా, ఆశించనంత వర్షం కురవలేదు.


nani1.2.jpgఅక్టోబరులో 17 సెం.మీ వర్షం మాత్రమే కురిసింది. కానీ, ఈ నెలలో సాధారణంగా 18 సెం.మీ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో, సోమవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అది డిసెంబరు 2న వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన వాతావరణ పరిస్థితి, అల్పపీడనం ఏర్పడే అవకాశాలు, తీవ్రత తదితరాలను వాతావరణశాఖ పర్యవేక్షిస్తోంది. పసిఫిక్‌ మహాసముద్రంలో ‘ఎల్‌నినో’ బలంగా ఉంది.


అందువల్ల, ఈ అల్పపీడన ప్రాంతం తుఫానుగా బలపడుతుందో లేదో ప్రస్తుతం చెప్పలేమని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో, దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం, ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉంది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హనీ ట్రాప్‌తో గ్యాంగ్‌స్టర్‌ టార్గెట్..

ప్రజలకు వెన్నుపోటు పొడవడం పవార్‌కు అలవాటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 12:52 PM