ప్రజలకు వెన్నుపోటు పొడవడం పవార్‌కు అలవాటే.. కాంగ్రెస్ మండిపాటు
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:38 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) మద్దతు తెలపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. మహారాష్ట్ర ప్రజలకు శరద్ పవాన్ వెన్నుపోటు పొడిచారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ మండిపడింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) మద్దతు తెలపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. మహారాష్ట్ర ప్రజలకు శరద్ పవార్ వెన్నుపోటు పొడిచారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ మండిపడింది. ఈ మేరకు ఎక్స్‌లో సుదీర్ఘంగా ఒక పోస్టు పెట్టింది. ఈ ఏడాది జనవరిలో శరద్ పవార్‌ను రాజ్యసభకు పంపడానికి మద్దతు ఇస్తే, తమకే పవార్ వెన్నుపోటు పొడిచారని విమర్శించింది. పవార్‌ది అధికార దాహమని మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత విజయ్ వడెట్టివార్ అన్నారు.
‘ప్రజలకు వెన్నుపోటు పొడిచే చరిత్ర శరద్ పవార్‌కు ఉంది. డీలిమిటేషన్ బిల్లుకు ఇచ్చి ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. ఆయనకు నిజమైన భావజాలం లేదు. ఆయనను మేము రాజ్యసభకు పంపితే, ఆయనేమో మాకు ద్రోహం చేశారు. ఈ విషయాన్ని ఆయన, ఆయన కుమార్తె సుప్రియా సూలె మర్చిపోయారేమో. తన తండ్రిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి సుప్రియ వ్యక్తిగతంగా మా పార్టీ నేతలను కోరారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారి పేర్లను చరిత్రలో రాస్తే, అందులో శరద్ పేరు కూడా ఉంటుంది. ఆయన చేసింది పూర్తిగా ఖండనీయం’ అని విజయ్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!
కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి