Share News

స్టాలిన్ డిమాండ్‌కు కేంద్రం ఓకే.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:48 AM

డీలిమిటేషన్ బిల్లుకు తాము మద్దతు ఇచ్చే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు తెలిపాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ లేవనెత్తిన డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని, ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన నిర్ణయించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

స్టాలిన్ డిమాండ్‌కు కేంద్రం ఓకే.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు!

ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లుకు తాము మద్దతు ఇచ్చే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు తెలిపాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ లేవనెత్తిన డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని, ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన నిర్ణయించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. డీలిమిటేషన్ బిల్లు ద్వారా ప్రస్తుతం లోక్‌సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను సగానికి పెంచాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అమల్లోకి తేవాలని చూస్తోంది.


డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీయేకు ఇప్పటికే మిత్రపక్షాలతో కలుపుకొని 321 మంది ఎంపీల మద్దతు ఉంది. మిగతా ఎంపీల మద్దతు కోసం డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) పార్టీల వైపు చూస్తోంది. ఎన్సీపీ ఇదివరకే మద్దతు తెలిపింది. ఇక డీఎంకే కూడా ఆ బిల్లుకు మద్దతు తెలపడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు రోజు మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచినా తమిళనాడు వాటా 7.18 శాతం అలాగే ఉండాలని, ఆ సంఖ్యకు ఎలాంటి విఘాతం కలగరాదన్నారు. అలాంటి పరిస్థితిలో మాత్రమే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, 1971 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు సీట్లను వచ్చే 25 ఏళ్ల వరకు అలాగే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.


మద్దతు ఇవ్వబోమని చాలెంజ్ చేయాలి..

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామన్న డీఎంకేపై టీవీకే మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకే తన వైఖరిని మార్చుకుందని విమర్శించింది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని బహిరంగంగా ప్రకటించాలని డీఎంకేకు టీవీకే చాలెంజ్ చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 10:55 AM