మురుగన్‌కు మోదీ పూజలు.. ఆయనదే విజయం అని ట్వీట్
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:55 AM
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి మదురైలోని తిరుపరంకుండ్రం ఆలయంలోని మురుగన్‌కు పూజలు చేశారు. ఆలయం వద్ద ఉన్న దీపస్తంభంపై శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత మోదీ ఆ ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి మదురైలోని తిరుపరంకుండ్రం ఆలయంలోని మురుగన్‌కు పూజలు చేశారు. ఆలయం వద్ద ఉన్న దీపస్తంభంపై శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత మోదీ ఆ ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. ‘వెట్రివేల్ మురుగనుక్కు అరోగర’ అని ఇంగ్లిష్, తమిళ్, హిందీలో ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా.. ఆలయం వద్ద ఉన్న దీప స్తంభంపై దీపం వెలిగించాలంటూ ఈనెల 20న ఇచ్చిన తన ఆదేశాలను ఉల్లంఘించినందుకు అంతకుముందు తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. తన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని పేర్కొంది. అలాగే అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ మేనేజింగ్ ట్రస్టీలను సస్పెండ్ చేసింది. వారి బాధ్యతలను తాత్కాలికంగా ఇద్దరు రిటైర్డ్ హైకోర్టు జడ్జీలకు అప్పగించింది.
విజయ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి: బీజేపీ
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కేపీ రామలింగం.. విజయ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విజయ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని తాజా పరిణామాలతో నిరూపితమైందన్నారు. శుక్రవారం రాత్రి నామక్కల్ జిల్లా రాశీపురంలోని అరుళ్మిగు నిత్య సుమంగళి మరియమ్మన్ ఆలయంలో నిర్వహించిన దీపాల వెలిగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు హిందూ వ్యతిరేక విజయ్ ప్రభుత్వ బండారం బయటపడిందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం విజయ్ ప్రభుత్వం అమలు చేయలేదని రామలింగం మండిపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..