పాక్ సరిహద్దుల్లో మరో ఎస్-400!
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:50 AM
పాకిస్థాన్ నుంచి భద్రతా పరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది
ఫిబ్రవరి నాటికి ఎల్‌వోసీ వెంట ‘సుదర్శన చక్ర’ మోహరింపు
న్యూఢిల్లీ, నవంబరు 27: పాకిస్థాన్ నుంచి భద్రతా పరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాలను ‘సుదర్శన చక్ర (ఎస్-400)’ రక్షణ వ్యవస్థ కిందకు తీసుకురావాలని ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నాటికి జమ్మూకశ్మీర్‌లోని 740 కిలోమీటర్ల నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఎస్-400 గగనత రక్షణ వ్యవస్థను మోహరించాలని భావిస్తోందని ఓ జాతీయ మీడియా సంస్థ అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. ప్రస్తుతం పాకిస్థాన్, చైనా సరిహద్దులను కవర్ చేసేలా పంజాబ్-జమ్మూ సెక్టార్ (పశ్చిమ సరిహద్దు), సిక్కిం సెక్టార్ (తూర్పు సరిహద్దు), రాజస్థాన్-గుజరాత్ సెక్టార్ (పశ్చిమ ఎడారి)లలో మూడు ఎస్-400లను వ్యూహాత్మకంగా భారత్ మోహరించింది. రష్యా నుంచి మరో రెండు ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలు అందినప్పుడు.. వాటిల్లో ఒకదాన్ని చికెన్స్ నెక్ కారిడార్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 1126 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖకు కాపలాగా అస్సాంలోని మోహరిస్తారని, ఐదో వ్యవస్థను జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు నివేదిక పేర్కొంది
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా