మహిళా బిల్లును అడ్డుకుంటే దేశానికి సమాధానం చెప్పాలి: కుమారస్వామి
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:42 AM
మహిళా బిల్లును అడ్డుకుంటే దేశానికి సమాధానం చెప్పాలి: కుమారస్వామి
న్యూఢిల్లీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ సహా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తే అది మహిళా సాధికారతను వ్యతిరేకించడమే అవుతుందన్నారు. దీనికి మూల్యంగా ఆ పార్టీ దేశంలోని మహిళలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా ఇప్పటికే ఉన్న సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేలా బిల్లులో మార్పులు చేశారని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత మార్పుల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఈ బిల్లులకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.