70 లక్షలకు చేరనున్న పీఎం సూర్యఘర్
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:54 AM
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక రూఫ్‌టాప్ సోలార్ పథకం... పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 70 లక్షల ఇళ్ల లక్ష్యానికి చేరువయింది
ఇప్పటికి రూ.37,989 కోట్ల సబ్సిడీ విడుదల
న్యూఢిల్లీ, నవంబరు 27: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక రూఫ్‌టాప్ సోలార్ పథకం... పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 70 లక్షల ఇళ్ల లక్ష్యానికి చేరువయింది. నవంబరు 26 నాటికి 69.10 లక్షల ఇళ్లకు పీఎం సూర్యఘర్ చేరింది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం... ఇప్పటి వరకూ రూ.37,989 కోట్ల సబ్సిడీని కేంద్రం విడుదల చేసింది. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పాదన 20.2 గిగావాట్లకు చేరింది. అయితే కేంద్ర మార్చి 2027 నాటికి కోటి ఇళ్లపై సూర్య ఫలకాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. దీన్ని చేరడానికి మరో 30 లక్షల ఇళ్లకు ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని చేర్చాల్సి ఉంది. పీఎం సూర్యఘర్ డాష్ బోర్డు ప్రకారం... నవంబరు 27 నాటికి యూపీ 9.89 లక్షల ఇన్‌స్టలేషన్లతో ముందంజలో ఉంది. దాని తర్వాత స్థానంలో 9.56 లక్షలతో గుజరాత్, 9.43 లక్షలతో మహారాష్ట్ర ఉన్నాయి. దరఖాస్తులు, ఆచరణ రూపం తీసుకోవడంలో తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, కోటి రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు 25 ఏళ్లలో లక్ష కోట్ల యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల 72 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్