Share News

ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:20 AM

తమిళనాడు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో వాతావారణ శాఖ చల్లటి వార్త చెప్పింది.

ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
Rains

  • వాతావరణ శాఖ వెల్లడి

చెన్నై: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో వాతావారణ శాఖ చల్లటి వార్త చెప్పింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక జిల్లాలో వేసవిఎండలు అదరగొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా 14జిల్లాల్లో 40డిగ్రీలసెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఈ నేపథ్యంలో పశ్చిమ కనుమలు ఉన్న జిల్లాలు, దక్షిణ తమిళనాడు కోస్తాతీర, డెల్టా జిల్లాల్లో ఒకటి రెండురోజుల్లో తేలికపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 29వ తేదీ నుంచి పశ్చిమ కనుమ జిల్లాల్లో తేలిక పాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, 30న నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది.


nani1.2.jpgమే 1న నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, వేలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపు జల్లులు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. 2న నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, వేలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2026 | 11:28 AM